Header Banner

వోడాఫోన్ ఐడియా యూజర్లకు గుడ్ న్యూస్! Vi రీఛార్జ్ ప్లాన్లు మరింత ఆకర్షణీయంగా!

  Fri Feb 28, 2025 21:34        Business

భారత టెలికాం రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. మారుమూల ప్రాంతాలకు కూడా నెట్‌వర్క్‌ అందించే విధంగా సంస్థలు పనిచేస్తున్నాయి. దీంతోపాటు డేటా స్పీడ్‌ మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే జియో, ఎయిర్‌టెల్ సంస్థలు 5G నెట్‌వర్క్‌ను అందిస్తున్నాయి. BSNL ప్రస్తుతం 4G నెట్‌వర్క్‌ను అందించేందుకు ప్రయత్నం చేస్తోంది. మే నాటికి దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతోంది. మరియు జూన్‌లో 5G నెట్‌వర్క్‌ను ప్రారంభిస్తామని చెబుతోంది.

అయితే మరో సంస్థ వోడాఫోన్‌ ఐడియా తన యూజర్‌లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. 5G నెట్‌వర్క్‌ను ట్రయల్స్‌ నిర్వహిస్తున్నట్లు (Vodafone idea 5G Trails) తెలిపింది. ముంబయిలో ఈ ట్రయల్స్‌ చేస్తున్నట్లు తెలిపింది. అనేక మంది వోడాఫోన్ ఐడియా యూజర్లు తమ సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి డెడ్‌లైన్.. పార్టీ నిర్మాణంపై కీలక ఆదేశాలు! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

 
ముంబయిలో ఎంపిక చేసిన కస్టమర్‌లకు Vi 5G నెట్‌వర్క్‌ అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. రూ.299, అంతకంటే ఎక్కువ రీఛార్జ్‌ ప్లాన్‌లపై అన్‌లిమిటెడ్‌ 5G డేటాను వినియోగించుకోవచ్చని.. Vi తన యూజర్లకు పంపిన మెసేజ్‌లో పేర్కొంది. దీనిపై అనేక మంది యూజర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ట్రయల్స్ విజయవంతం అయ్యాక.. దశలవారీగా దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నారు. ముంబయి తర్వాత ఢిల్లీ, బెంగళూరు, చంఢీగడ్‌, పాట్నా వంటి ప్రాంతాల్లో 5G నెట్‌వర్క్‌ లాంచ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు తెలిసింది. Vi 5G ట్రయల్స్ కు సంబంధించిన మెసేజ్‌లను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

వోడాఫోన్‌ ఐడియా రూ.299 రీఛార్జ్ ప్లాన్ (Vi Rs299 Recharge Plan) ద్వారా అన్‌లిమిటెడ్‌ కాలింగ్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ప్రతిరోజు 100 SMS లను పొందవచ్చు. డేటా పరంగా ఈ ప్లాన్‌లో రోజువారీ 1GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది.

 

ఇది కూడా చదవండి: జీవీ రెడ్డి రాజీనామా వెనక ఉన్న అసలు కారణం ఇదే! ఎవరు నిజంఎవరు తప్పు!



రూ.349 రీఛార్జ్‌ ప్లాన్‌లో (Vi Rs349 Recharge Plan) భాగంగా అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ప్రతి రోజు 1.5GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. అయితే ఈ ప్లాన్‌లో భాగంగా మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు. రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అన్‌లిమిటెడ్‌ డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు సోమవారం నుంచి శుక్రవారం వరకు మిగిలిన డేటాను శని, ఆదివారాల్లో వినియోగించుకోవచ్చు. ప్రతి నెల ఇలా 2GB వరకు వినియోగించుకోవచ్చు. రూ.369 Vi రీఛార్జ్‌ ప్లాన్‌లో (Vi Rs369 Recharge Plan) భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు ప్రతి రోజు 100 SMS లను వినియోగించుకోవచ్చు. అదే విధంగా రోజువారీ 2GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా 12AM నుంచి 12PM వరకు అన్‌లిమిటెడ్‌ డేటాను వినియోగించుకోవచ్చు.

ఈ ప్లాన్‌లో భాగంగా వీకెండ్ డేటా రోల్‌ఓవర్, డేటా డిలైట్‌ వంటి అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. డేటా డిలైట్‌ అంటే.. సోమవారం నుంచి శుక్రవారం వరకు మిగిలిన డేటాను శని, ఆదివారాల్లో వినియోగించుకోవచ్చు. ఇలా నెలకు ఒకసారి 2GB వరకు వినియోగించుకోవచ్చు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీ మాజీ ఎంపీకి షాక్.. మరో కేసు నమోదు! ఈ వ్యాఖ్యలే ఆయన్ను చిక్కుల్లోకి..

 

అసలు నిజాన్ని బయటపెట్టిన పోసాని.. ఆ పదవి కోసమే... వారు చెప్పినట్టే చేశాను! సుమారు 9 గంటలపాటు..

 

నేడు తొలిసారిగా పూర్తిస్థాయి బ‌డ్జెట్.. అనంత‌రం ఉద‌యం 10 గంట‌ల‌కు..

 

పిల్లల్నీ వదల్లేదు.. 299 మంది రోగులపై అత్యాచారం! వీడు మనిషి కాదు ఎంత క్రూరంగా..

 

భారతీయ విద్యార్థులకు షాక్ ఇచ్చిన కెనడా.. వారికి వీసా రద్దు చేసే అవకాశం! ఈ కొత్త నిబంధనలతో..

 

వంశీ కి దిమ్మతిరిగే షాక్.. మళ్లీ మరో కేసు నమోదు! ఇక పర్మినెంట్ గా జైల్లోనే.మరో 15 మందిపై..

 

హెచ్చరిక.. ఓసారి మీ అకౌంట్‌ చెక్‌ చేసుకోండి.. రూ. 236 ఎందుకు కట్‌ అయ్యాయో తెలుసా?

 

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలుమార్గదర్శకాలు ఇవే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #Vi5GTrials #VodafoneIdea5G #5GisHere #Unlimited5GData #ViUsersHappy #TechUpdate #FastInternet #WeekendDataBonus #StayConnected #ViRechargePlans